News January 6, 2025
చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..!

చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 12, 2025
HYD: రెండేళ్లలో 400 క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు..!

HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. క్యాన్సర్ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాల్లో ఏకంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీల ద్వారా అతి సులువుగా, రోగికి ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా వైద్య బృందం వెల్లడించింది. MNJ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు వరంగా మారుతోంది.
News November 12, 2025
HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.
News November 12, 2025
HYD: 15 ఏళ్లు దాటితే తుక్కుగా మార్చాలి.. RTC సమాలోచన!

కేంద్ర ప్రభుత్వ పాలసీ ద్వారా 15 ఏళ్లు దాటిన ఆర్టీసీ డీజిల్ బస్సులను తుక్కుగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో HYD రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా అధికారులు తెలియజేశారు. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడంపై సైతం సమాలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు వివరించారు.


