News January 8, 2025

చర్లపల్లి టెర్మినల్ ఓపెన్.. మరి రోడ్లు?

image

చర్లపల్లి టెర్మినల్ అత్యాధునిక హంగులతో‌ ప్రారంభమైంది. స్టేషన్‌కు వెళ్లే రోడ్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికుల అభిప్రాయం. సిటీ నుంచి వచ్చే వారు హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా స్టేషన్‌కు చేరుకోవచ్చు. కీసర, మేడ్చల్, ECIL వాసులు రాంపల్లి మీదుగా వస్తారు. ప్రస్తుతం ఈ రహదారులు బాగానే ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే రోడ్లను విస్తరించాల్సిందేనా..? దీనిపై మీ కామెంట్?

Similar News

News January 10, 2025

HYD: RTC స్పెషల్ బస్సులపై ఛార్జీల పెంపు

image

రేపటి నుంచి సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 10, 11,12,19,20 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో 16 ప్రకారం 50% వరకు ఛార్జీల పెంపు అమలులో ఉంటుందని పేర్కొంది. HYDలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

News January 9, 2025

HYD: ట్రై సైకిళ్లకు దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి

image

ఛార్జింగ్ ట్రై సైకిల్‌లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.

News January 9, 2025

గౌలిదొడ్డి గురుకులంలో 9వ తరగతికి ప్రవేశాలు

image

గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఫిబ్రవరి 23వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.