News February 27, 2025

చర్లపల్లి నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లు

image

చర్లపల్లి నుంచి కాకినాడ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్  బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28, మార్చి 7, 13, 21, 28ల్లో రాత్రి 7:20 చర్లపల్లి నుంచి రైలు (07031) బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 4:30లకు కాకినాడకు చేరుకుంటుంది. మార్చి 2, 9, 16, 23, 31ల్లో సాయంత్రం 6:55 కాకినాడ నుంచి రైలు(07032) బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:50కు చర్లపల్లికి చేరుకుంటుంది.

Similar News

News November 15, 2025

ADB: ఫెన్సింగ్ క్రీడాకారులకు శిక్షణ శిబిరం: సత్యనారాయణ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ ఫెన్సింగ్ జోనల్ స్థాయి పోటీలలో సెలెక్ట్ అయిన అండర్ 14,17క్రీడాకారులకు 18వ తేదిన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఒక్కరోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షుడు చిట్లా సత్యనారాయణ తెలిపారు. కావున అందరు కూడా ఎలిజిబుల్ ఫార్మ్స్‌తో హాజరు కాగలరని తెలిపారు. ఫోన్ 9550838190‌కు సంప్రదించాలన్నారు.

News November 15, 2025

తిప్పేస్తున్న జడేజా.. 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్సులో RSA 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తా చాటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాళ మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

News November 15, 2025

పెద్దపల్లి: NOV 14 – 20 వరకు సహకార వారోత్సవాలు

image

PDPL జిల్లాలో NOV 14-20 వరకు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ప్రతిరోజు ప్రత్యేక అంశాలపై కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌, గ్రామీణాభివృద్ధి, సహకార విద్య, మహిళ-యువత సాధికారత, గ్రీన్ ఎనర్జీ, టూరిజం వంటి విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సహకార అధికారి శ్రీమాల పాల్గొన్నారు.