News February 6, 2025
చర్లలో ఉరేసుకుని యూపీ వాసి మృతి

బాత్రుంలో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. UP చౌటీర్యాలీకి చెందిన అమర్ సింగ్ పానీపూరి బండితో జీవనం సాగిస్తున్నాడు. గత 2 రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్నాడు. మనస్తాపంతో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూం నుంచి బయటికి రాకపోయేసరికి భార్య ప్రీతి వెళ్లి చూడగా ఉరేసుకుని ఉన్నాడు.
Similar News
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 14, 2025
వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.


