News February 7, 2025
చర్ల: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని హత్య చేసిన మావోయిస్టులు..!

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన చర్ల మండల సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో జరిగింది. అరన్‌పూర్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జోగా బోర్సే బరిలో ఉన్నారు. శుక్రవారం మావోయిస్టులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. దీంతో జోగా బర్సేను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News February 17, 2026
వెంకీ-కార్తీతో అనిల్ క్రేజీ మల్టీస్టారర్?

వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి కలిసి వర్క్ చేయనున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో కీలక పాత్ర కోసం తొలుత ఫహాద్ ఫాజిల్ పేరు వినిపించింది. ఇప్పుడు తమిళ స్టార్ కార్తీ పేరు తెరపైకి వచ్చింది. ‘బామ్మర్ది బాలిరెడ్డి’ టైటిల్ ప్రచారంలో ఉంది. జులై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే, కీర్తి సురేశ్ హీరోయిన్లని టాక్. 2027 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News February 17, 2026
తెలంగాణ హరితాభివృద్ధికి కీలక వేదికగా ఎదిగింది: మంత్రి

ఎఫ్‌సీఆర్‌ఐ తెలంగాణ హరితాభివృద్ధికి కీలక వేదికగా ఎదిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. Forest College and Research Institute (FCRI)లో 10వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మొక్కలను నాటారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందన్నారు.
News February 17, 2026
వికారాబాద్‌లో ఈనెల 24న బియ్యం వేలం

జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో పట్టుబడిన సుమారు 583 క్వింటాళ్ల రేషన్ ఫిబ్రవరి 24న వేలం నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వికారాబాద్‌లో 68.05 క్వింటాళ్లు, మండల స్టాక్ పాయింట్ పరిగిలో 86.50 క్వింటాళ్లు తాండూరులో 261.20 క్వింటాళ్లు, కొడంగల్‌లో 167.15 క్వింటాళ్లు మొత్తం 582.90 క్వింటాళ్ల బియ్యాన్ని బహిరంగ వేలం వేస్తున్నట్లు చెప్పారు.


