News December 17, 2024
చలితో వణుకుతున్న మెతుకుసీమ

మెతుకుసీమ చలితో వణుకుతుంది. రోజురోజుకూ ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రతతో ఆయా మండలాలు, పట్టణ వాసులు ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రత తోపాటు పొగమంచు దట్టంగా ఉంటే తెల్లవారు జాము ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వాహనాలు జాగ్రత్తగా నడుపుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News January 10, 2026
మెదక్: ‘సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు’

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఏడు రోజుల సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయని, సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News January 10, 2026
మెదక్: ‘సీఎం కప్ క్రీడలు.. 16 వరకు ఛాన్స్’

మెదక్ జిల్లాలో ‘సీఎం కప్’ క్రీడల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేష్ మండల విద్యా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. క్రీడల అవగాహన కోసం ఈనెల 12 వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
News January 10, 2026
వసతి గృహాల్లో పారిశుధ్యానికి పెద్దపీట: కలెక్టర్

జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన వసతులు, పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాహుల్ తెలిపారు. కుల్చారం కేజీబీవీని సందర్శించిన ఆయన.. బోధన, మెనూ, పారిశుధ్యంపై ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో ‘క్లీనింగ్ యాక్టివిటీ’ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడేది లేదని, అపరిశుభ్రతపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


