News April 12, 2025
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: డీఎస్పీ

కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ రామనుజం ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడతారని, అటువంటి ఇబ్బందిని గుర్తించి జిల్లా ఆర్యవైశ్య సంఘం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు మరెన్నో ఇలాంటి సేవ పనులు చేయాలన్నారు. నాగేశ్వర్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
News October 23, 2025
కామారెడ్డి: మద్యం దుకాణాల కోసం నేడు తుది గడువు.!

కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం బుధవారం (నిన్న) వరకు 1,449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు Way2Newsకు తెలిపారు. నేటికి చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 23, 2025
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.