News February 15, 2025
చల్పాకలో సమ్మక్కకు పూజలు నిర్వహిస్తున్న భక్తులు

ఏటూరునాగారం మండలం బానాజీ బంధం (చల్పాక)లో ఆలం వంశీయులు (తలపతులు), కోరం వంశీయులు (వడ్డేలు) ఆధ్వర్యంలో సమ్మక్క జాతర ఘనంగా జరుగుతోంది. గురువారం రాత్రి దేవుని గుట్ట నుండి సమ్మక్క రూపంలో తీసుకొచ్చిన కుంకుమ భరణిని ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్క గద్దె పైకి తెచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్కను దర్శించుకోవడానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారంతో ఈ జాతర ముగియనుంది.
Similar News
News October 18, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్త!

ఇవాళ్టి నుంచి దీపావళి టపాసుల మోత మోగనుంది. ఈ సందర్భంగా పిల్లలపై పెద్దలు ఓ కన్నేసి ఉంచడం మేలు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్‌వి ధరించాలి. కాలికి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. క్రాకర్స్‌ను చేతిలో పట్టుకుని కాల్చకుండా, సురక్షితమైన దూరం పాటించాలి. కాల్చిన లేదా సగం కాలిన టపాసులను ముట్టుకోకూడదు. వాటిపై నీరు పోసి పారేయాలి. గడ్డివాములు, గుడిసెల దగ్గర అస్సలు పేల్చకూడదు.
News October 18, 2025
లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి: కలెక్టర్

PC PNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. శనివారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. అల్ట్రా సౌండ్ క్లినిక్‌లు కలిగిన నర్సింగ్ హోమ్‌లు, ఇమేజింగ్ కేంద్రాలు, జెనెటిక్ మొబైల్ కేంద్రాలు, కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యువల్, సరోగసి క్లినిక్‌లు తదితర సంస్థలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
News October 18, 2025
డిప్యూటీ సీఎం భట్టి రేపటి పర్యటన వివరాలు

బోనకల్ మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డిప్యూటీ సీఎం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఇందిరా మహిళా డైరీ లబ్ధిదారుల సమావేశంలో పాల్గొంటారని అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.