News March 20, 2025
చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికం..!

నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా భానుడు విలయ తాండవం ఆడుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం బుధవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 42.3°C ఉష్ణోగ్రత నమోదవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్చిలోనే 42.3°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News December 13, 2025
ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
News December 13, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్: మొగల్తూరు SI

బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు మొగల్తూరు ఎస్ఐ వై. నాగలక్ష్మి తెలిపారు. గురువారం తోటలో పనులు చేసుకుంటున్న ఆమెపై పెద్దిరాజు(29) దాడి చేయగా.. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.
News December 13, 2025
బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


