News March 8, 2025
చాగలమర్రిలో 40.6°C

నంద్యాల జిల్లా చాగలమర్రిలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మరో రెండు నెలలు ఈ ఎండలు కొనసాగే అవకాశం ఉందని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News October 27, 2025
7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు

2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు అత్యధికంగా ప.బెంగాల్లో(3,812) ఉన్నాయి. తర్వాతి స్థానంలో తెలంగాణ(2,245) ఉంది. 2023-24తో పోలిస్తే జీరో అడ్మిషన్ పాఠశాలల సంఖ్య 4,961 తగ్గింది. సదరు పాఠశాలల్లో విద్యార్థుల్లేకున్నా WBలో 17,965 మంది, TGలో 1,016 మంది టీచర్లుండటం గమనార్హం.
News October 27, 2025
ఏలూరు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

తుపాన్ తీవ్రతపై జిల్లా యంత్రాంగం తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఎస్పీతో కలిసి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. అన్ని మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్ 94910 41419, టోల్ ఫ్రీ నంబర్ 180023 31077కు ఫోన్ చేసి ప్రజలు తుపాన్ పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు.
News October 27, 2025
పారాది వంతెన వద్ద బందోబస్తు

బొబ్బిలి మండలం పారాది వంతెన వద్ద వాహనదారులు ఇబ్బందులు పడకుండా రాత్రి సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాజ్వే పైనుంచి వరదనీరు ప్రవహించడంతో వాహనాలను వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. వంతెనపై రాత్రి కంటైనర్ లారీ ఉండిపోవడంతో ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్, కానిస్టేబుల్స్ క్రెయిన్ సహాయంతో లారీని బయటకు తీసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.


