News March 8, 2025
చాగలమర్రిలో 40.6°C

నంద్యాల జిల్లా చాగలమర్రిలో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.6°C ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మరో రెండు నెలలు ఈ ఎండలు కొనసాగే అవకాశం ఉందని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News March 27, 2025
వికారాబాద్: యువకుడి ఆత్యహత్య

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన బంట్వారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. యాచారం గ్రామానికి చెందిన సుడే మహిపాల్ రెడ్డి(35) ఇంటిదగ్గర వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై తాగిన మైకంలో ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
News March 27, 2025
హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

AP: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కార్‌కు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.
News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.