News September 6, 2024

చాగల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

image

పెద్దపప్పూరు మండలంలో అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం పర్యటించారు. మండల పరిధిలోని చాగల్లులో పెన్నానదిపై నిర్మించిన చాగల్లు రిజర్వాయర్‌ను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. రిజర్వాయర్ సామర్థ్యం, ఇన్ ఫ్లో ఎంత ఉందన్న వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 6, 2024

కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి

image

స్థానిక RTC బస్‌స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 6, 2024

శింగనమల: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శింగనమల మండలం పెద్దకుంటలో కురిసిన వర్షానికి పిడుగు పడి శింగనమల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఋషింగప్ప(27) శంకర్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 6, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక

image

పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్-14 విభాగంలో హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమేశ్ బాబు, పీడీ అజీమ్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన ఓం శ్రీ, ఫర్హాన్ అనే విద్యార్థినులు ఎంపిక అయ్యారన్నారు.