News June 24, 2024

చాగల్లు రిజర్వాయర్‌లో మరో మృతదేహం లభ్యం

image

పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యామ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం మహిళ నజయా మృతదేహం లభ్యం కాగా.. తాజాగా మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాషాగా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరు మరిది, వదినలని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 10, 2024

ఆర్టీసీ రాయలసీమ జోనల్ ఛైర్మన్‌గా పూల నాగరాజు

image

ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ ఛైర్మన్‌గా పూల నాగరాజును ప్రభుత్వం నియమించింది. రాయదుర్గానికి చెందిన పూల నాగరాజు గతంలో గుమ్మగట్ట మండల జెడ్పీటీసీ సభ్యులుగా, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పని చేశారు. అలాగే టీడీపీ వాల్మీకి హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేశారు. టీడీపీలో సుదీర్ఘకాలం సేవలందించిన నాగరాజును ఆర్టీసీ జోనల్ ఛైర్మన్గా నియమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

News November 10, 2024

శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..!

image

శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నలుగురు ఎంపికైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. గోరంట్లకు చెందిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి విజయకుమార్, రెడ్డిపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ యాసీన్, కేసాపురానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ చెన్న కృష్ణారెడ్డి, ధర్మవరం మోడల్ పాఠశాలకు చెందిన శిరీష ఎంపికయ్యారన్నారు. రేపు పుట్టపర్తిలో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రధానం చేస్తారన్నారు.

News November 10, 2024

కుందుర్పి మండలంలో చిరుత కలకలం

image

కుందుర్పి మండలం జమ్ము గుంపుల పంచాయతీ పరిధిలోని కొలిమిపాలెం శివారులో శనివారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. దాని దాడిలో దూడ మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయాలని వారు కోరుతున్నారు.