News April 5, 2025

చాట్రాయి: ఆలయానికి చేరిన భద్రాది రామయ్య అక్షింతలు

image

భద్రాచలం రామాలయం నుంచి చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన కోదండ రామాలయానికి తలంబ్రాలు చేరుకున్నాయి. ప్రతి ఏటా భద్రాచలం రాములోరి అక్షింతలనే సీతారామ కళ్యాణానికి వినియోగించడం ఆనువాయితీగా వస్తోంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, పూజారి మారుతి తలంబ్రాలను సేకరించి స్వామివారి వద్ద భద్రపరిచారు. తలంబ్రాలను శనివారం పంపించానున్నారు.

Similar News

News November 23, 2025

సూర్యాపేట జిల్లాలో మెడికల్ దందా

image

జిల్లాలో మెడికల్‌ షాపుల్లో దందా ఇష్టరాజ్యమైంది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని వారే డాక్టర్లా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు అమ్ముతున్నారు. జిల్లాలో సుమారు 700 మెడికల్ షాప్‌లు రిజిస్టర్ కాగా.. అనధికారికంగా మరో వందకు పైగా షాపులు ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యుడి చీటి లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

News November 23, 2025

HYD రూపురేఖలు మార్చేసే ‘హిల్ట్’ పాలసీ!

image

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)కి ఆమోదం తెలిపింది. దీని ద్వారా బాలానగర్, కటేదాన్ వంటి నిరుపయోగ పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్‌లుగా మారుస్తారు. ఈ స్థలాల్లో ఇకపై నివాస, వాణిజ్య, ఐటీ నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. స్థలం వెడల్పును బట్టి SRO ధరల్లో 30%- 50% డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు (DIF) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు 6 నెలల్లోపు TG IPASS ద్వారా సమర్పించాలి.

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.