News March 25, 2025
చాట్రాయి: పులి సంచారిస్తోదంటూ జోరుగా ప్రచారం

చాట్రాయి మండలంలో సోమవారం సాయంత్రం పులుల సంచారం జరిగిందంటూ రైతులు చెబుతున్నారు. మండల పరిధిలోని చిన్నంపేట నుండి పర్వతాపురం వెళ్లే దారిలో ఉన్న మొక్కజొన్న చేలలోకి పులులు వచ్చాయంటూ కొందరు రైతులు సమాచారం అందిస్తున్నారు. పులి సంచారానికి సంబంధించి పాద ముద్రలు కూడా ఫోటోల ద్వారా సేకరించామన్నారు. ఇదే విషయమై ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు బృందాలుగా వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 7, 2025
వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.


