News June 1, 2024

చాణక్య, కేకే.. కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

image

ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకుగాను కూటమి 2, వైసీపీ 4 చోట్ల విజయం సాధించనుండగా.. 4 చోట్ల టఫ్ ఫైట్ ఉండనుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. అలాగే కూటమి 6, వైసీపీ 3, మరోచోట టఫ్ ఫైట్ ఉంటుందని కే.కే సర్వే తెలిపింది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనిపై మీ కామెంట్.

Similar News

News July 6, 2025

కడప: ‘రిమ్స్‌‌లో తనిఖీలు’

image

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు పద్మావతి శనివారం పర్యటించారు. పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్ఐసీయూలో పుట్టిన బిడ్డల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు వచ్చే పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించి ఆర్టీసీ అధికారులు, విద్యాలయ అధ్యాపకులతో చర్చించారు.

News July 5, 2025

ఎర్రగుంట్ల: ‘RTPPలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింపు’

image

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650MW. వీటినుంచి ఏప్రిల్‌లో 839.98MU, మేలో 616.31MU, జూన్‌లో 729.28MU విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(PLF) మాత్రమే ఉపయోగిస్తున్నారు. RTPPలో 210X5MW, 600X1MW యూనిట్లు ఉన్నాయి.

News July 5, 2025

కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

image

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.