News June 1, 2024
చాణక్య X సర్వే: కరీంనగర్‌లో టఫ్ ఫైట్.. బీజేపీకి ఛాన్స్!

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 28, 2025
కురిక్యాల ఘటనపై MLA సత్యం సీరియస్

గంగాధర మండల కురిక్యాల ZPHSలోఅటెండర్ యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల ప్రవర్తించి తీరుపై MLA మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై ఆరా తీసి, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్, సీపీతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 28, 2025
హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.
News October 28, 2025
కరీంనగర్: ఉరివేసుకొని రాజస్థాన్ కూలి మృతి

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ కూలి ఉరివేసుకుని మృతి చెందాడు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన బూర రామ్ గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాయికి ఉంటున్న ఇంట్లోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


