News June 1, 2024
చాణక్య X SURVEY: ఖమ్మం కాంగ్రెస్‌దే..!

ఖమ్మం పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేశారు. BJP నుంచి తాండ్ర వినోద్ రావు, BRS నుంచి నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 1, 2025
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.
News December 1, 2025
ఖమ్మం: నేటి నుంచి కొత్త వైన్స్.. ఎన్నికల జోష్

ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొకవైపు ఈ నెలలో3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, వైన్స్ వ్యాపారులు తొలి నెలలోనే అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.


