News October 29, 2024

చాపాడు కాలువలో పడి బాలుడు మృతి

image

రాజుపాలెం గ్రామానికి చెందిన ఆదిల్(11) అనే బాలుడు చాపాడు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆదిల్ మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

Similar News

News October 31, 2024

కడప నుంచి బెంగళూరు బయలుదేరిన జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.

News October 31, 2024

ప్రొద్దుటూరు మహిళకు ఐకానిక్ అవార్డు

image

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కడప జిల్లా మహిళ సత్తా చాటింది. ప్రొద్దుటూరుకు చెందిన సుజిత బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. చెన్నై వేదికగా WBPC ఆధ్వర్యంలో కాస్మటాలజిస్ట్ పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 18 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా.. వరల్డ్ బ్యూటీ కాస్మటాలజిస్ట్, అస్థెటిక్ ఐకాన్ అవార్డులను సుజిత దక్కించుకున్నారు. హీరో విశాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమెను పలువురు అభినందించారు.

News October 31, 2024

కడప జిల్లా వాసికి వైవీయూ డాక్టరేట్

image

వైవీయూ తెలుగు శాఖ స్కాలర్ తమ్మిశెట్టి వెంకట నారాయణకు డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం.ఎం.వినోదిని పర్యవేక్షణలో “తెలుగులో శ్రామిక కథలు – స్త్రీ చైతన్యం (1980 నుంచి 2015 వరకు)” అనే శీర్షికపై పరిశోధన చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లెకు చెందిన వెంకట నారాయణ చేసిన పరిశోధనలో మూడున్నర దశాబ్ద కాలంలో గ్రామీణ, పట్టణ మహిళల స్థితిగతులు, ఆనాటి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు.