News March 6, 2025
చాపాడు: భార్యను గొడ్డలితో నరికిన భర్త

చాపాడు మండలం నక్కలదిన్నె సమీపంలో గురువారం మధ్యాహ్నం భార్యను భర్త యెర్రిబోయిన భాస్కర్ గొడ్డలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ, ఎస్సై చిన్న పెద్దయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 23, 2025
పులివెందుల: వివేకా హత్య.. రంగంలోకి సిట్ బృందం

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ బృందం విచారణ చేపడుతోంది. అనుమానాస్పదంగా మృతి చెందిన సింహాద్రిపురం(M) కసనూరు (V)కు చెందిన కటిక రెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలిసింది. కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్‌కు ముందు వరుసలో ఉన్నారు.
News March 23, 2025
YVU: ‘ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి’

వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావుని YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాధ కుమార్, కులసచివులు ఎన్. రాజేశ్ కుమార్ రెడ్డి కడప సీపీ బ్రౌన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందజేశారు. యోగి వేమన యూనివర్సిటీ కంట్రోల్‌లో ఉన్న గురుకుల భవనాలలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నిర్వహించుకొనుటకు అనుమతించవలసినదిగా కోరామన్నారు.