News February 12, 2026

చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

image

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.

Similar News

News March 9, 2026

గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

image

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.

News March 9, 2026

భారత మెన్స్ టీమ్ గెలిచిన ICC WCలు

image

భారత పురుషుల జట్టు ఇప్పటివరకు 5 సార్లు ప్రపంచకప్‌లు సాధించింది. అందులో రెండు వన్డే WCలు, మూడు T20WCలు ఉన్నాయి. 1983లో వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 WC, 2011లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 WC, 2026లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల కెప్టెన్సీలో భారత్ ఈ కప్పులు సొంతం చేసుకుంది.

News March 9, 2026

చంద్రబాబుకు ఆ అర్హత లేదు: YS జగన్

image

AP: CM CBNకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత లేదని జగన్ విమర్శించారు. ‘మహిళలకు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌లేదు. అయినా అన్నీ చేసేసిన‌ట్లు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా డ్రామా మొదలెట్టారు. మీ MLAలు, TTD ఛైర్మ‌న్‌ అత్యాచార‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిర్మించారు. పిల్ల‌ల్ని, మ‌హిళ‌ల్ని మీరు పెంచి పోషిస్తున్న కామాంధులు ఎలా చిదిమేస్తున్నారో చూసి సిగ్గనిపించ‌డం లేదా’ అని ట్వీట్ చేశారు.