News February 4, 2025
చారకొండ: బందోబస్తు మధ్య కూల్చివేతలు

చారకొండ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి నిర్మాణం కోసం గ్రామంలోని ఊరి మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను జేసిబీలతో ఇళ్లను తొలగించారు. తొలగింపు కార్యక్రమాన్ని తహశీల్దార్ సునీత, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ ఇసాక్ హుస్సేన్ కూల్చివేతలు పర్యవేక్షించారు.
Similar News
News March 17, 2026
ప్రపంచంలో క్రూడాయిల్ ఎక్కువగా వాడే దేశాలివే..

2024 లెక్కల ప్రకారం క్రూడాయిల్ వినియోగంలో అమెరికా, చైనా టాప్‌లో ఉన్నాయి.
1. అమెరికా: 19 మిలియన్ బ్యారెళ్లు (ఒక రోజులో)
2. చైనా: 16.4 మి. బ్యారెళ్లు
3. భారత్: 5.6 మి. బ్యారెళ్లు
4. సౌదీ అరేబియా: 4 మి. బ్యారెళ్లు
5. రష్యా: 3.8 మి. బ్యారెళ్లు
6. జపాన్: 3.2 మి. బ్యారెళ్లు
7. సౌత్ కొరియా: 2.9 మి. బ్యారెళ్లు
>మిలియన్ అంటే 10 లక్షలు. బ్యారెల్ అంటే 159 లీటర్లు
News March 17, 2026
కృష్ణా: ఎండలు హీట్.. బొండాల ధరలు హాట్!

జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శీతల పానీయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు ప్రజలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా లభ్యత తగ్గిపోవడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి బొండాలను కృష్ణా జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.
News March 17, 2026
TU: వర్సిటీ హాస్టల్స్ తనిఖీ చేసిన ఉపకులపతి

టీయూలోని బాలుర, బాలికల హాస్టళ్లను వీసీ ప్రొ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైస్ ఛాన్సలర్, హాస్టళ్లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. చీఫ్ వార్డెన్ రవీందర్ రెడ్డి ఉన్నారు.


