News March 22, 2025
చారకొండ: మాజీ ఆర్మీ జవాన్ విగ్రహం ధ్వంసం

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని బోడబండ తండాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ మహిపాల్ నాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాణవత్ శంకర్ నాయక్ డిమండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గు చేటని అన్నారు. దుండగులు విగ్రహం ముక్కు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు.
Similar News
News November 21, 2025
రాజమౌళి క్షమాపణ చెప్పడం మంచిది: విష్ణువర్ధన్ రెడ్డి

దేవుడిని నమ్మనంటూ దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘దేవుడిపై చేసిన వ్యాఖ్యలకు సినీ దర్శకుడు రాజమౌళి క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలకడం మంచిది’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తామంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది.
News November 21, 2025
యాక్టివ్ పాలిటిక్స్‌లోకి కొడాలి, వల్లభనేని

ఉమ్మడి కృష్ణా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపున్న నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరు కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో పాలిటిక్స్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా వీరిద్దరూ జగన్‌తో భేటీ కావడంపై వార్తల్లో నిలిచారు. కొడాలి, వంశీ తిరిగి యాక్టివ్ అవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మళ్లీ ప్రజలతో మమేకమవుతూ, పలు రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
News November 21, 2025
గోవింద కోటితో శ్రీవారి VIP బ్రేక్ దర్శనం

యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మంపై అనురక్తి కల్పించడమే లక్ష్యంగా TTD కీలక నిర్ణయం తీసుకుంది. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు VIP దర్శనాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 1,00,01,116 సార్లు రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.


