News February 5, 2025
చారగొండలో 26 ఇళ్ల తొలగింపు

చారకొండ 167 జాతీయ రహదారి రోడ్డు విస్తరణ భాగంలో భాగంగా మండల కేంద్రంలో మొత్తం 30 ఇళ్లు తొలగించాల్సి ఉండగా అధికారులు ఇప్పటికీ 26 తొలగించారు. ఇల్లు కోల్పోయిన 26 మందికి నష్టపరిహారం అందజేసినట్లు తహశీల్దార్ సునీత తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న మరో నాలుగు ఇళ్లు కూల్చివేయాల్సి ఉండగా సంబంధిత ఇంటి యజమానులు కూల్చివేతకు సుముఖంగా లేరని తెలిసింది.
Similar News
News November 5, 2025
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News November 5, 2025
MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.
News November 5, 2025
8 కిలోమీటర్లు కాలినడకన గుట్టకు చేరిన కలెక్టర్

కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కి.మీ.లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి (కనకాద్రి) గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను ఆయన అభినందించారు.


