News January 11, 2025
చారిత్రక స్థలాల్లో ఒకటిగా భట్టిప్రోలు స్తూపం
యథార్థమైన బుద్ధుని ధాతువు అయిన బాపట్ల(D)లోని భట్టిప్రోలు స్తూపం ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈ స్తూపం క్రీ.పూ.4-3 శతాబ్దాల మధ్య అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ స్తూపం చక్రాకార పథం కలిగి ఉంటుంది. భట్టిప్రోలులో లభ్యమైన అవశేషాల్లోనూ బండరాయి పెట్టెలపైన లిఖించిన శాసనాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అప్పట్లో ఇది అత్యంత ఐశ్వర్యవంతమైన ప్రాంతంగా పేరొందింది
Similar News
News January 16, 2025
GNT: భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు
భారత సైనిక వ్యవస్థలో నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది.1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ ఇలా ప్రతి యుద్ధంలో ఈ గ్రామ సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తతు తీసుకొని గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించింది.
News January 14, 2025
రేపు గుంటూరు రానున్న బాబీ, తమన్
గుంటూరు ఐటీసీ హోటల్ నుంచి మైత్రి మూవీస్ వరకు బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగనున్న బైక్ ర్యాలీలో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొంటారని గుంటూరు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు బెల్లంకొండ సురేశ్ మంగళవారం తెలిపాడు. అనంతరం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను అభిమానులతో బాబీ, తమన్, డిస్టిబూటర్స్ చూడనున్నారని తెలిపారు. ఈ ర్యాలీని బాలయ్య అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.
News January 14, 2025
చేనేతలపై అభిమానాన్ని చాటుకున్న మంత్రి లోకేశ్
చేనేతలపై అభిమానాన్ని మంత్రి లోకేశ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లిన లోకేశ్, భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.