News March 24, 2025
చార్మినార్: పాతబస్తీలో పార్కింగ్‌కు నో పరేషాన్ !

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సిటీ కాలేజీ, కులీ కుతుబ్ షా స్టేడియం, ఖిల్వంత్ గ్రౌండ్, మోతీగల్లీ ఓల్డ్ పెన్షన్ ఆఫీస్ ప్రాంతం, ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్, చార్మినర్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునాని ఆస్పత్రి ప్రాంగణం ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.
Similar News
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.
News December 6, 2025
HYD: మహా GHMCలో 250 డివిజన్లు.!

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.
News December 6, 2025
HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్‌మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.


