News March 24, 2025

చార్మినార్: పాతబస్తీలో పార్కింగ్‌కు నో పరేషాన్ !

image

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సిటీ కాలేజీ, కులీ కుతుబ్ షా స్టేడియం, ఖిల్వంత్ గ్రౌండ్, మోతీగల్లీ ఓల్డ్ పెన్షన్ ఆఫీస్ ప్రాంతం, ముఫీద్ ఉల్ ఆనం గ్రౌండ్, చార్మినర్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునాని ఆస్పత్రి ప్రాంగణం ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు.

Similar News

News November 18, 2025

వేములవాడ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

image

వేములవాడ ఏరియా ఆసుపత్రిని కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం సందర్శించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.