News April 10, 2024
చార్మినార్ వద్ద ఇదీ పరిస్థితి!

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. PIC CRD: Anjum Alam
Similar News
News November 25, 2025
GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఇవే!

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్‌పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, IDAబొల్లారం,తెల్లాపూర్, అమీన్పూర్
☛కార్పొరేషన్లు: బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్,నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్పేట్ విలీనమవుతాయి.
ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్‌లో లేవు
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్‌కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్‌కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.


