News April 10, 2024
చార్మినార్ వద్ద ఇదీ పరిస్థితి!

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
PIC CRD: Anjum Alam
Similar News
News March 22, 2025
రేపు ఉప్పల్‌లో SRH VS RR.. ఇవి నిషేధం!

⊘కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు
⊘కత్తులు, గన్నులు, మారణాయుధాలు
⊘టపాసులు, సిగరెట్, అగ్గిపెట్టె, లైటర్
⊘మద్యపానం, కూల్‌డ్రింక్స్, బయటి ఆహార పదార్థాలు
⊘పెంపుడు జంతువులు
⊘హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్
⊘హెల్‌మెట్, బైనాక్యులర్ స్టేడియం లోపలికి తీసుకురావొద్దని <<15844156>>రాచకొండ<<>> పోలీసులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 22, 2025
HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.