News April 8, 2025

చావును రాజకీయం చేయడానికే జగన్ పర్యటన: పరిటాల

image

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్‌కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.

Similar News

News December 11, 2025

అనంతపురం కలెక్టర్‌కు 22వ ర్యాంకు

image

అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌కు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 22వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 930 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 863 ఫైల్స్ క్లియర్ చేశారు. ఈయన ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 5 రోజుల 22 గంటల సమయం తీసుకున్నారు.

News December 9, 2025

వాహనదారులారా.. రూల్స్ అతిక్రమించకండి: ఎస్పీ

image

అనంతపురం జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. వాహనదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వేగం, ప్రమాదకర డ్రైవింగ్, మద్యం మత్తు, నిద్రమత్తు డ్రైవింగ్‌ను పూర్తిగా నివారించాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డు సంకేతాలను వాహనదారులు కచ్చితంగా పాటించాలన్నారు. బండి పత్రాలు ఉండాలని, హెల్మెట్/సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడలని, లేనిచో చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు.

News December 9, 2025

అనంత జిల్లాలో యువకుడి దారుణ హత్య

image

అనంతపురం(D) బుక్కరాయ సముద్రం పంచాయతీ పరిధిలోని వీరభద్ర కాలనీకి చెందిన సాయిచరణ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి చరణ్ స్నేహితులే పొలంలో కొట్టి చంపి, అనంతరం బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌లో విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.