News July 1, 2024
చింతకొమ్మదిన్నె: పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి కేనా..?

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలిటిక్స్లో మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు కొన్నింట్లో పాల్గొని, మరి కొన్నింట్లో కనిపించకుండా పోయారు. దీంతో ఆయన పాలిటిక్స్కు దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. అయితే వారం రోజుల నుంచి ఆయనకు సంబంధించిన అభిమానులు, నాయకులు ‘BOSS IS BACK’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.