News May 26, 2024
చింతకొమ్మదిన్నె: బీరు బాటిళ్లు లారీ బోల్తా

కడప – రాయచోటి రహదారిలోని గువ్వల చెరువు ఘాట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 1200 బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయి. పాండిచ్చేరి నుంచి రాయపూర్కు బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్ను ఢీకొంది. దీంతో బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Similar News
News December 1, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,790
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,767
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1750
News December 1, 2025
ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.


