News May 26, 2024
చింతకొమ్మదిన్నె: బీరు బాటిళ్లు లారీ బోల్తా

కడప – రాయచోటి రహదారిలోని గువ్వల చెరువు ఘాట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 1200 బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయి. పాండిచ్చేరి నుంచి రాయపూర్‌కు బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Similar News
News February 20, 2025
భూముల రిసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: జేసీ

జిల్లాలో భూముల రిసర్వే వేగవంతంగా, పకడ్బందీగా నిర్వహించి నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రిసర్వేపై సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. అనంతరం అదితి సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు.
News February 19, 2025
కడప జిల్లా TODAY టాప్ న్యూస్

➣ కడప: ‘ముస్లింలు అంటే సీఎంకు చిన్నచూపు’
➣ గోపవరం: గుండెపోటుతో 24 ఏళ్ల యువకుడు మృతి
➣ సిద్దవటం మండలంలో భారీ చోరీ
➣ 22న ప్రొద్దుటూరులో మినీ జాబ్ మేళా
➣ లింగాలలో పట్టుబడిన చీనీ కాయల దొంగలు
➣ కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
➣ కమలాపురం: నలుగురి పిల్లలతో తల్లి జీవన పోరాటం
➣ గండికోటలో సెల్ఫీ తీసుకున్న కలెక్టర్, MLA
➣ జగన్‌పై జమ్మలమడుగు MLA ఫైర్
News February 19, 2025
కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

కడప జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.