News July 9, 2024
చింతకొమ్మదిన్నె: భర్త చేతిలో భార్య హత్య

మండలంలోని పాపాసాహెబపేట చెందిన లక్ష్మీదేవిని భర్త వెంకటసుబ్బారెడ్డి రోకలిబండతో బాది హత్య చేశాడు. SI శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు.. వెంకటసుబ్బారెడ్డికి తన భార్య లక్ష్మిదేవితో తరచూ గొడవ పడేవాడు. సోమవారం ఇద్దరూ గొడవపడగా.. సుబ్బారెడ్డి ఆగ్రహంతో క్షణికావేశంలో రోకలిబండతో భార్య తలపై బాదాడు. తీవ్ర గాయాలైన లక్ష్మీదేవిని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించిందని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 19, 2025
కడప: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మంచిగా ఉండమని చెప్పినందుకు బంధువు నరసింహుడిని చంపిన నిందితుడు నాగరాజుకు శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టు యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. నిందితుడు తన బంధువును 2021లో జమ్మలమడుగులోని ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి సత్యకుమారి శుక్రవారం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 19, 2025
ప్రొద్దుటూరులో నేడు బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13,220.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.12,162.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1,980.00
News December 19, 2025
కడపలో వారి గన్ లైసెన్సుల రద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గన్ లైసెన్స్లపై దృష్టి సారించారు. లైసెన్స్ పొందిన వారి గురించి ఆరా తీస్తున్నారు. వారిపై కేసుల వివరాలు, నేర చరిత్రను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 దాకా గన్ లైసెన్స్లు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సమస్యలు సృష్టించే వారి గన్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.


