News September 11, 2024
చింతకొమ్మదిన్నె: వైవీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ
యోగి వేమన విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల ఘర్షణకు లవ్ లెటర్ కారణమని తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విద్యార్థిని మైక్రో బయాలజీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తిన్న విద్యార్థి బంధువులను పిలిపించి గాయపరిచిన వారిపై దాడి చేసే సందర్భంలో వారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో తల దాచుకున్నారని సమాచారం.
Similar News
News October 5, 2024
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.
News October 5, 2024
కడప: ‘మా కుమార్తెను కువైట్‌లో అమ్మేయాలని చూస్తున్నాడు’
మత మార్పిడితో ఓ వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన భూషణ్ రెడ్డి కుమార్తెను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వాళ్లు రూ.4.8 లక్షల నగదు, 26 తులాల బంగారం తీసుకెళ్లారని, పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేశారని తన కుమార్తెను సౌదీలో అమ్మేస్తాడేమోనని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
News October 5, 2024
కడప జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు
కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత ప్రదేశాలలో రిపోర్ట్ చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.