News February 4, 2025

చింతపల్లిలో ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

చింతపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సుర్ల విశ్వతేజ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్ వెనుక కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ వినోద్ బాబు, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో, పరీక్షలు రాసినా పాసవలేను అంటూ రాసిన లేఖ మృతదేహం వద్ద లభించిందని వారు వెల్లడించారు.

Similar News

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

image

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

BNGR: ఆ 18 కార్డులతో ఓటేయొచ్చు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కలెక్టర్ హనుమంతరావు కీలక సూచన చేశారు. ఓటరు కార్డు లేకపోయినా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు సహా ప్రభుత్వం జారీ చేసిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News February 9, 2026

చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

image

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్‌, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.