News June 20, 2024

చింతపల్లిలో వెస్టిండియన్ చెర్రీస్

image

చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో సాగు చేపట్టిన వెస్టిండియన్ చెర్రీస్ ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటు న్నాయి. ఎరుపు రంగులో ఉండే వీటిలో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. ఇవి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని స్థానిక పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు తెలిపారు. మొక్కలు అన్ని రకాల నేలల్లోనూ ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

image

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.