News August 13, 2024

చింతపల్లి: అప్పులు తీర్చ లేక రైతు ఆత్మహత్య

image

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవూర మండలం చింతపల్లి తండాలో జరిగింది. గ్రామానికి చెందిన జటావత్ కృష్ణ పది ఎకరాల్లో బత్తాయి తోటలో నీటి కోసం బోర్లు వేయించగా బోర్లలో నీరు పడకపోవడంతో పంట ఎండి పోవడానికి వచ్చింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి. మనస్థాపంతో కృష్ణ పురుగుల మందు తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 25, 2024

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి!

image

నల్గొండ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు చలిమంటలు కాచుకోక తప్పడం లేదు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో 19 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.  చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News November 25, 2024

NLG: ముగింపు దశకు ధాన్యం సేకరణ

image

ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈఏడాది నల్గొండ జిల్లాలో 370, సూర్యాపేట జిల్లాలో 310, యాదాద్రి భువనగిరి జిల్లాలో 372 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యాన్ని సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో అంచనాలకు మించి ధాన్యాన్ని రైతులు మార్కెట్లకు తీసుకువచ్చారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,24,135 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

News November 25, 2024

చింతలపాలెంతో నాకు 30 సంవత్సరాల అనుబంధం :మంత్రి ఉత్తమ్

image

చింతలపాలెం మండలంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చింతలపాలెం మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయించానన్నారు.మండలం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తానని తెలిపారు.