News March 23, 2025

చింతపల్లి: జిల్లాలో ఈనెల 26 వరకు తేలికపాటి వర్షాలు

image

అల్లూరి జిల్లాలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శనివారం తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకులోయ, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 0.5 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు.

Similar News

News April 23, 2025

దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

image

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.

News April 23, 2025

సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

image

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు. 

News April 23, 2025

హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

image

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!