News February 21, 2025
చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 21, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు.. ఒక గేటు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి 4,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఒక వరద గేట్లను ఎత్తి 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405 అడుగులు (17.802 టీఎంసీ)లతో నిండుకుండలా మారింది.
News October 21, 2025
తెరుచుకోని కేంద్రాలు.. గ్రామాల్లో దళారుల తిష్ట

దళారులు చేతిలో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. ఇప్పటికే పత్తి మొదటి దశ పత్తి ఏరడం పూర్తయి రెండో దశ కూడా ఏరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నేటికీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో తిష్ట వేసి కొనుగోళ్లు చేస్తున్నారు. దీపావళి తర్వాతే సీసీఐ కేంద్రాలను ప్రారంభించనున్నారు.
News October 21, 2025
కర్నూలులో ‘కె ర్యాంప్’ హీరో

‘కె ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం సోమవారం రాత్రి కర్నూలులో సందడి చేశారు. నగరంలోని ఆనంద్ కాంప్లెక్స్లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్కు హీరో వచ్చాడన్న విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. ఈ దీపావళికి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.