News February 15, 2025

చింతపల్లి: వ్యక్తి ఆకస్మిక మృతి

image

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కిటుములలో శుక్రవారం రాత్రి మర్రి కేశవరం (30) అనే వ్యక్తి ఆకస్మికంగా మరణించాడు. శుక్రవారం బ్యాంకు పనిమీద చింతపల్లి వెళ్లి వచ్చాడు. రాత్రి టాయిలెట్‌కు వెళ్లి తిరిగి పడుకోగా ఉదయం మృతి చెంది ఉన్నాడని బంధువులు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఊపిరితిత్తుల ఆపరేషన్ జరిగిందని, ఇదే సమస్యతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తమ్ముడిని చూసేందుకు నేడు వెళ్తాడని ఈ లోగా ఇలా జరిగిందని వాపోయారు.

Similar News

News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వర్షానికి నేలకు కూలిన మొక్కజొన్న పంటలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. పలుచోట్ల వరద నీరు చేరి పంట నీట మునిగింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

News March 22, 2025

ట్రంప్ ఎఫెక్ట్..5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు

image

USAలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన దాదాపు 5.30 లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు. వచ్చే నెల 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుంది. యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు.

News March 22, 2025

గుంటూరు హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

image

గుంటూరు జాతీయ రహదారిపై, అద్దంకి వెళ్లే మార్గంలో మేదరమెట్ల వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో మరణించిన వ్యక్తి వివరాలు, వాహనం ఆనవాళ్లు లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!