News October 21, 2024

చింతమనేనికి బెదిరింపు.. బోరుగడ్డపై కేసు

image

వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.

Similar News

News October 21, 2024

ఏలూరు: కరెంట్ షాక్ తగిలి యువకుడి మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం విషాద ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడేనికి చెందిన కవులూరి చరణ్(20) గురవాయిగూడెంలో కర్ర కోత మిషన్ పనికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ షాక్ తగిలి మృతిచెందాడు. కోత మిషన్ యజమాని మేకల గంగాధర్ తిలక్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 21, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి

image

ఉమ్మడి ప.గో జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తణుకు మండలం పైడిపర్రుకు చెందిన వెంకటేశ్వర రావు(60), దుర్గ(50) కొవ్వూరు మండలం మద్దూరులో జరిగే శుభకార్యానికి బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో నిడదవోలు మండలం గోపవరం వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News October 21, 2024

ప.గో: ముగిసిన పల్లె పండగ వారోత్సవాలు

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.