News January 24, 2025
చింతలపూడి: అదుపు తప్పి కారు బోల్తా

చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి నుంచి ప్రగడవరం వైపు వెళుతున్న మారుతి కారు మూలమలుపు వద్ద అదుపు తప్పి పంట పొలాల్లో దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారులో సిద్దాంతి ఇరుక్కుపోవడంతో అటుగా వెళ్తున్న కె.గోకవరానికి చెందిన పీహెచ్సీ వైద్యాధికారి కృష్ణ కిషోర్ తన వృత్తి ధర్మంతో గాయాలతో ఉన్న సిద్దాంతికి చికిత్స అందించారు. ప్రమాదంలో కారు నుజ్జయింది.
Similar News
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
News March 13, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ లండన్లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం
News March 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.