News April 24, 2025

చింతలపూడి: పరారీలో ఉన్న నలుగురి అరెస్ట్

image

కామవరపుకోట మండలంలో పాత నాటు సారా కేసులలో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. జలపావారిగూడెంకు చెందిన జువ్వల సత్యవతి, వెంకటాపురానికి చెందిన రాజులపాటి దుర్గారావు, ఆడమిల్లికి చెందిన మిరియాల శరత్ కుమార్ (బెల్లం సరఫరా చేసిన వ్యక్తి), కొత్తగూడెంకి చెందిన రాచప్రోలు మల్లికార్జునరావులను అరెస్ట్ చేశామన్నారు. చింతలపూడి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు.

Similar News

News April 25, 2025

NLG: ఒకే తరహా ఘటనలు.. చర్యల్లో వివక్ష!

image

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ఘటనల్లో అధికారులు చర్యలు తీసుకోవడంలో వివక్ష చూపుతున్నట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. KTR (మం) చెరువుఅన్నారంలో 6.18 గుంటల భూమిని DT సుకన్య ఇతరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో సుకన్యను కలెక్టరేట్‌కు అటాచ్ చేశారే తప్ప చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. HZNRలో పట్టా మార్పిడి విషయంలో మాత్రం తహశీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

News April 25, 2025

శ్రీహరికోట: కీలక ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో

image

పాకిస్తాన్‌పై నిఘా పెట్టేందుకు స్పై శాటిలైట్‌ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ఉపగ్రహం ద్వారా 24 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా భారత్-పాక్ సరిహద్దుపై భద్రతా ఏజన్సీలు నిఘా ఉంచనున్నాయి. అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే PSLV-C61 మిషన్‌ను ఇస్రో ప్రయోగిస్తుందని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.

News April 25, 2025

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి వాసి

image

తూ.గో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షునిగా తాళ్లపూడి మండలం, పోచవరానికి చెందిన కాకర్ల వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తానని ఆయన అన్నారు.

error: Content is protected !!