News February 16, 2025

చింతలపూడి: బాలికకు జీబీఎస్ లక్షణాలు..UPDATE

image

చింతలపూడిలోని యర్రగుంటపల్లిలో బాలికకు జీబీఎస్ లక్షణాలు కనిపించగా..విజయవాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. బాలిక నుంచి సీఎస్ఎఫ్ నమూనాలను తీసి తుది నిర్ధారణకు చెన్నైకు పంపినట్లు డీఎంహెచ్ వో, డీఈవో తెలిపారు. ఫలితాలు రావడానికి 2 వారాలు పడుతుందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్యంగా ఉందన్నారు. బాలిక స్వగ్రామంలో పలువురి నమూనాలను సేకరించగా ఎవరికీ లక్షణాలు లేవని పీహెచ్సీ వైద్యాధికారి నరేశ్ తెలిపారు.

Similar News

News March 25, 2025

నాటు సారా నిర్మూలన బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్.

image

నాటు సారా వలన కలిగే అనర్థాలను ప్రజలలో విస్తృత అవగాహన కల్పించి, నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా *”నవోదయం” -* నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన గోడ పత్రికను, బుక్లెట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు.

News March 24, 2025

పెనుమంట్ర: 5 నెలల్లో ఐదుగురు మృత్యువాత

image

పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

News March 24, 2025

ఏలూరులో యువతిపై ముగ్గురు అత్యాచారం

image

ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్‌కు చెందిన వంశీకృష్ణ ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.

error: Content is protected !!