News July 12, 2024
చింతలపూడి: సోదరిని చూసేందుకు వెళ్తూ మృతి

చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గాలంకి శ్యామ్ యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. అతని తల్లితో కలిసి విజయవాడలోని తన సోదరిని చూసేందుకు వెళ్తుండగా మృత్యువు కబలించింది. ప్రమాదంలో మృతుని తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. శ్యామ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)లో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు.
Similar News
News February 11, 2025
ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి స్నేహితుల అండ

ఇటీవల రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.
News February 11, 2025
ఉంగుటూరు : రైలు పట్టాలపై దంపతుల ఆత్మహత్య

ఉంగుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు బాధ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో దొరికిన ఫోన్ ఆధారంగా వారు పెంటపాడు మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 11, 2025
ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ

ఉమ్మడి గోదావరి జిల్లాలలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూగా అధికారులు నిర్ధారించారు. తణుకు మండలం వేల్పూరు, తూ.గోలోని పెరవలి(M) కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన శాంపిల్స్ తో బర్డ్ ఫ్లూగా తేల్చారు. కానూరు గ్రామానికి 10కి.మీల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చికెన్, గుడ్లు తినడం తగ్గించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. కి.మీ పరిధిలోని కోళ్లను, గుడ్లను కాల్చి వేయాలని ఆదేశించారు.