News August 16, 2024
చింతలమనేపల్లి: గాలివానకు కూలిన ఇల్లు

చింతలమనేపల్లి మండలంలోని ఖర్జెల్లీ గ్రామంలో గురువారం కురిసిన గాలివానకు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చేసుకుంటున్న నాయిని తులసి ఇల్లు కూలిపోయింది. భారీగా గాలి రావడంతో ఇంటి పైకప్పుతో సహా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు, నాయకులు స్పందించి తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.
Similar News
News December 4, 2025
ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.

నార్నూర్‌లో 6, గాదిగూడలో 4 సర్పంచ్‌లు ఏకీగ్రీవం

మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. నార్నూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలకు గాను గంగాపూర్, జామ్డా, ఖంపూర్, మహాగావ్, మాన్కాపూర్, మాలేపూర్ మొత్తం 6 సర్పంచ్‌లు, 198 వార్డులకు గాను 157 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గాదిగుడలో మొత్తం 4 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు గాను 181 ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.