News February 26, 2025

చింతలమానేపల్లిలో రూ.19లక్షల మద్యం స్వాధీనం

image

మండలంలోని గూడెం గ్రామంలో భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా గూడెం గ్రామంలో తనిఖీలు చేశామన్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.19 లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలువురిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News October 26, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 55 పోస్టులు

image

ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 55 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 26, 2025

జలమండలి ప్రాజెక్ట్.. 61 సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి

image

జలమండలి పరిధిలో రిజర్వాయర్లను పూర్తి చేయడం కోసం కసరత్తు చేస్తున్నట్లు HMWSSB అధికారులు తెలిపారు. ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డు వరకు 71 రిజర్వాయర్లలో ఇప్పటికే, 61 పూర్తి చేసి, మిగిలినవి వివిధ దశలో ఉన్నట్లు ప్రత్యేక నోటీసు విడుదల చేశారు. త్వరలోనే వాటిని సైతం పూర్తి చేసి, పూర్తిస్థాయిలో నీటి సరఫరా కోసం చర్యలు చేపడతామన్నారు.

News October 26, 2025

18 మృతదేహాలు అప్పగింత

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో 19మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. వీరిలో 18 మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఓ గుర్తుతెలియని మృతదేహం కోసం చిత్తూరు(D) నుంచి ఒకరు వచ్చారని SP విక్రాంత్ తెలిపారు. తన తండ్రి కనిపించడంలేదని ఆ వ్యక్తి చెప్పినట్లు వివరించారు. DNA ఆధారంగా ఆ డెడ్‌బాడీ ఎవరిదన్నది తేలుతుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని పేర్కొన్నారు.