News February 26, 2025
చింతలమానేపల్లిలో రూ.19లక్షల మద్యం స్వాధీనం

మండలంలోని గూడెం గ్రామంలో భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా గూడెం గ్రామంలో తనిఖీలు చేశామన్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.19 లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలువురిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 18, 2025
విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.
News March 18, 2025
మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

సెల్‌ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్‌లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT
News March 18, 2025
సూర్యాపేట జిల్లా నేటి టాప్ న్యూస్..

> సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేత మర్డర్ > కేటీఆర్ సమావేశం విజయవంతం చేయాలి: గాదరి > కలెక్టరేట్ ఎదుట వంటవార్పు> తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని డిమాండ్> govt జాబ్ కొట్టిన సూర్యాపేట జిల్లా బిడ్డ > కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు > సూర్యాపేటలో ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్ > ప్రజా సమస్యల పరిష్కరించాలి: సీపీఎం> పటేల్ రమేశ్ రెడ్డిని కలిసిన నేతలు