News March 14, 2025

చింతలమానేపల్లి: వనదేవతలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

డబ్బా గ్రామంలో కొన్ని రోజుల క్రితం సమ్మక్క సారలమ్మలకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన SI నరేశ్ విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన మల్లేశ్ @ హరీశ్‌ను సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని సిర్పూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతడికి మతిస్థిమితం లేదని, ఎర్రగడ్డకు తరలించాల్సిందిగా తీర్పునిచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News March 23, 2025

దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

image

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

News March 23, 2025

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

image

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్‌ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.

News March 23, 2025

ప్రాక్టీస్ ఫొటోలు షేర్ చేసిన SRH

image

ఈ సీజన్‌లో SRH తొలి మ్యాచ్ మరో మూడు గంటల్లో మొదలు కాబోతోంది. రాజస్థాన్‌పై గెలిచి హోంగ్రౌండ్ తొలి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వాలని ప్లేయర్స్ కసరత్తు చేస్తున్నారు. టీమ్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన SRH మేనేజ్మెంట్.. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆటగాళ్ల దృఢ సంకల్పం కన్పిస్తోందని కామెంట్ చేసింది. అటు స్టేడియానికి ఫ్యాన్స్ తాకిడి మొదలవగా ఉప్పల్ పరిసరాల్లో కోలాహలంగా ఉంది.

error: Content is protected !!